Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెన్నై జట్టులోనే కొనసాగుతా. ధోనీ
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ వెనక్కి తగ్గాడు. వచ్చే ఏడాది కూడా మహీ చెన్నై జట్టులోనే కొనసాగుతాడని ఆ జట్టు ప్రతినిధి తాజాగా మీడియాకు వెల్లడించారు. వచ్చే ఏడాది మరో రెండు జట్లు కొత్తగా ఐపీఎల్లో చేరుతున్న నేపథ్యంలో ఈసారి మెగా వేలం నిర్వహించనున్నారు. అయితే, పాత జట్లు పలువురు కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకునే వీలు కల్పించడంతో చెన్నై తొలి రిటెన్షన్ కార్డును ధోనీ కోసమే ఉపయోగిస్తామని ఆయన అన్నారు. దీంతో ధోనీ వచ్చే ఏడాది కూడా చెన్నై తరఫున ఉంటాడని స్పష్టమవుతోంది. మరోవైపు కోల్‌కతాపై తుదిపోరులో గెలిచిన అనంతరం ధోనీ మాట్లాడుతూ తన భవితవ్యంపైనా స్పందించాడు. చెన్నై తరఫున వచ్చే సీజన్లో ఆడే విషయాన్ని కొట్టిపారేయలేదు. కానీ ఫ్రాంఛైజీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. ''సీఎస్కేకు ఏది మంచిదో మేం నిర్ణయించాలి. అది ముగ్గురు కావొచ్చు లేదా నలుగురు కావొచ్చు.. ఫ్రాంఛైజీ అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాలో నేనుంటానా లేదా అన్నది ముఖ్యం కాదు. బలమైన జట్టు ఉండేలా, ఫ్రాంఛైజీ ఇబ్బంది పడకుండా చూడడం ముఖ్యం. వచ్చే వేలంతో వచ్చే పదేండ్ల కోసం జట్టును తయారు చేసుకోవాలి. 2008 నుంచి చెన్నై ప్రధాన జట్టు పదేండ్లకు పైగా ఉంది. వచ్చే పదేండ్లు కూడా ప్రధాన జట్టుతో ముందుకెళ్లడానికి మేం బాగా కష్టపడాలి'' అని ధోని అన్నాడు.