Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఫెన్సింగ్‌లో పోటీ పడి చరిత్ర సృష్టించిన ఫెన్సర్ భవానీ దేవి మరో అరుదైన ఘనత సాధించింది. ఫ్రాన్స్‌లో జరిగిన చార్లెల్విల్లె నేషనల్ కాంపిటీషన్లో వ్యక్తిగత సేబర్ విభాగంలో విజేతగా నిలిచింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆమె స్వయంగా వెల్లడించింది. ''ఇండివిడ్యువల్ సేబర్ విభాగంలో ఛార్లెల్విల్లె నేషనల్ కాంపిటీషన్ గెలిచాను. కోచ్‌లు క్రిస్టియర్ బార్, ఆర్నాడ్ ష్నైడర్ ఇతర టీమ్‌మేట్స్‌కు ధన్యవాదాలు. సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించిన అందరికీ శుభాకాంక్షలు'' అని 28 ఏళ్ల ఈ ఫెన్సర్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్త ఫెన్సర్ ర్యాంకింగ్స్‌లో భవానీ దేవి 50వ స్థానంలో ఉంది. 2022 ఏషియన్ గేమ్స్‌లో రాణించాలని ఆమె కషిచేస్తోంది. దానికోసం ఇప్పటి నుంచే శ్రమిస్తోంది.