Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4బంతుల్లో 4వికెట్లు తీసిన కాంఫర్
- టి20 ప్రపంచకప్ అర్హత టోర్నీ
అబుదాబి: టి20 ప్రపంచకప్ అర్హత టోర్నీ గ్రూప్-ఏలో ఐర్లాండ్ జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తుచేసింది. టాస్ ఓడి తొలి బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌ను కాంఫర్ దెబ్బకు కేవలం 106 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ మ్యాక్స్ ఒడోవర్(51) కెప్టెన్ సీలర్(21) మాత్రమే రాణించగా.. కర్టిస్ కాంఫర్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం 107 పరుగుల విజయలక్ష్యాన్ని ఐర్లాండ్ 15.1 ఓవర్లలోనే ఛేదించింది. గారెత్ డెలానీ(44), ఓపెనర్ పాల్ స్టిర్లింగ్(30నాటౌట్) ఐర్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో క్లాసెన్, గ్లోవర్, కెప్టెన్ సీలార్ తలో వికెట్ తీశారు.
కాంఫర్ రికార్డ్
ఐర్లాండ్ ఫాస్ట్ బౌలర్ కర్టిస్ కాంఫర్.. మలింగ(శ్రీలంక), రషీద్‌ఖాన్(ఆఫ్ఘనిస్తాన్)ల పేరిట ఉన్న వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్ల రికార్డును సమం చేశాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో కాంఫర్ వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ పదో ఓవర్లో నెదర్లాండ్స్ బ్యాటర్స్ కొలిన్ అకెర్మాన్, రియాన్ టెన్ డూషె, స్కాట్ ఎడ్వర్డ్స్, రోలోఫ్ వాండెర్ మెర్వ్లను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. దీంతో అంతర్జాతీయ టి20 క్రికెట్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా కర్టిస్ నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కాంఫర్‌కు లభించింది.
టి20 ప్రపంచకప్ అర్హత టోర్నీలో నేడు..
స్కాట్లాండ్ × పపువాన్యూగేనియా(మ.3.30గం||లకు)
ఓమన్ × బంగ్లాదేశ్(రా.7.30గం||లకు)
ఐసిసి టి20 ప్రపంచకప్ అర్హత టోర్నీ..
గ్రూప్-ఏ మా గె ఓ పా నె.ర.
ఐర్లాండ్ 1 1 0 2 +1.755
శ్రీలంక 0 0 0 0 0
నమీబియా 0 0 0 0 0
నెదర్లాండ్స్ 1 0 1 0 -1.755
గ్రూప్-బి
ఓమన్ 1 1 0 2 +3.135
స్కాట్లాండ్ 1 1 0 2 +0.300
బంగ్లాదేశ్ 1 0 1 0 -0.300
పపువాన్యూగేనియా 1 0 1 0 -3.135