Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 మంది అథ్లెట్లకు జ్వరం
బెంగళూర్ : 2021 ఎఫ్ఐహెచ్ జూనియర్ హాకీ ప్రపంచకప్‌కు టీమ్ ఇండియా సన్నద్ధతకు డెంగీ దెబ్బ తగిలింది. నవంబర్‌లో భువనేశ్వర్ వేదికగా ఆరంభం కానున్న హాకీ జూనియర్ వరల్డ్‌కప్‌లో భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. బెంగళూర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సారు) సెంటర్లో హాకీ క్యాంప్ ఏర్పాటు చేశారు. టీమ్ ఇండియా వరల్డ్‌కప్ ప్రాబబుల్స్‌ను ఈ క్యాంప్‌లో సాన పడుతున్నారు. వరల్డ్‌కప్‌కు ముందు భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. హాకీ క్యాంప్‌లోని పలువురు అథ్లెట్లు సహా 50 మంది అథ్లెట్లు తీవ్ర జ్వరం బారిన పడ్డారు. అందులో నలుగురు హాకీ క్రీడాకారులు, ఓ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌కు డెంగ్యూ జ్వరం నిర్దారణ అయ్యినట్టు బెంగళూర్ సారు చీఫ్ రితూ పాఠక్ తెలిపారు.