Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్ మీడియా హక్కులకు రెక్కలు
- బీసీసీఐ వర్గాల అంచనా
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చే సీజన్ నుంచి పది జట్లతో కనువిందు చేయనుం డగా.. రానున్న ఐదేండ్ల కాలానికి మీడియా హక్కులు, డిజిటల్ హక్కుల రూపంలో కాసుల వర్షంలో తడిసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రంగం సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం స్టార్ ఇండియాతో ఐపీఎల్ మీడియా హక్కుల ఒప్పందం 2022 సీజన్‌తో ముగియనుంది. అక్టోబర్ 25న రెండు నూతన ప్రాంఛైజీల ప్రకటించనున్న అదే రోజు మీడియా హక్కుల కోసం టెండర్లు పిలువనుంది. స్టార్ ఇండియా గత ఐదు సీజన్లకు రూ.16347.50 కోట్లు (2.55 బిలియన్ డాలర్లు) చెల్లించింది. 2023-2027 కాలానికి బీసీసీఐ మీడియా హక్కుల రూపంలో రూ. 35 వేల కోట్లు ఆశిస్తోంది. పది జట్ల ఐపీఎల్‌తో మ్యాచుల సంఖ్య 74కు పెరుగనుంది. దీంతో మీడియా హక్కుల ఆదాయం సైతం ఆకాశానికి చేరనుంది. అమెరికాకు చెందిన ఓ ప్రముఖ మీడియా కంపెనీ ఐపీఎల్ ప్రసార హక్కులపై ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.