Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైదానంలో ఆడాల్సింది ఆటగాళ్లే
- సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
దుబాయ్: టీ20 ప్రపంచకప్‌ను మరోసారి అందుకునేందుకు ఆరాటపడుతున్న టీమ్ ఇండియా అందుకోసం అన్ని కోణాల్లోనూ జట్టును బలోపేతం చేసుకుంది. ఒత్తిడిని చిత్తు చేసి, మ్యాచ్ పరిస్థితులను తేలిగ్గా అర్థం చేసుకుని వ్యూహలు సిద్ధం చేయటంలో ఎం.ఎస్ ధోని మేటీ. అందుకే ప్రపంచకప్ కోసం మెంటార్‌గా ధోనీని తీసుకున్నారు. మహీ రాకతో డ్రెస్సింగ్‌రూమ్ వాతావరణం, మెరుగైన వ్యూహలు రచించటంలో స్పష్టమైన మార్పు కనిపించవచ్చు గానీ.. మెంటార్‌గా ధోని అంతా చేయలేదని లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. 'మెంటార్ పెద్దగా ఏం చేయలేరు. డ్రెస్సింగ్‌రూమ్ వాతావరణంలో మార్పునకు, వ్యూహ రచనలో మెంటార్ పాత్ర ఉంటుంది. విరామ సమయంలో బ్యాటర్లు, బౌలర్లతో మాట్లాడేందుకు ఉపయోగపడ తాడు. కానీ మైదానంలో ప్రదర్శన చేయాల్సిన బాధ్యత ఆటగాళ్లపై ఉంటుంది. ఒత్తిడిని ఏ విధంగా ఎదుర్కొంటారనే విషయంపై విజయం ఆధారపడి ఉంటుంది. ప్రత్యేకించి నాకౌట్ మ్యాచుల్లో టీమ్ ఇండియా సరైన తుది జట్టు కూర్పుతో బరిలోకి దిగటంపైనే విజయావకాశాలు ఆధార పడి ఉన్నాయి. నాకౌట్ మ్యాచుల్లో ప్రతిసారీ ఓవర్‌కు సగటున 7 పరుగులు చేయటం అంత సులువు కాదు. ఆ మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్ ఎంచుకోవటం సైతం కీలకమే. మిడిల్ ఓవర్లలో భారత బ్యాటింగ్ కాస్త ఆందోళనకరం. ఆ నాలుగైదు ఓవర్లలో భారత్ 40 పరుగులు చేసినా బాగుంటుంది. 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఫేవరేట్ కాదు. 20 ఓవర్ల ఆటలో ఏ జట్టు ఏ జట్టునైనా ఓడించగలదు. ఇదేమీ టెస్టు క్రికెట్ కాదు, స్పష్టమైన ఫేవరేట్ ఉండేందుకు. వేగంగా మలుపు తిరిగే టీ20ల్లో తక్కువ తప్పులు చేసిన జట్టునే విజయం వరిస్తుంది' అని గవాస్కర్ అన్నాడు.