Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేసులో 22 కార్పోరేట్ కంపెనీలు
ముంబయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండు నూతన ప్రాంఛైజీలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అహ్మదాబాద్, గువహటి, ధర్మశాల, లక్నో, ఇండోర్లలో ఏదేని రెండు నగరాలు వేదికలుగా బీసీసీఐ నూతన ప్రాంఛైజీలకు టెండర్లు పిలువగా విశేష స్పందించింది. మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ సహా యజమాని లాన్సెర్ క్యాపిటల్ ఐపీఎల్ ప్రాంఛైజీ రేసులో నిలిచింది. రూ.10 లక్షలకు టెండరు పత్రాలను 22 సంస్థలు కొనుగోలు చేసినట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అదానీ గ్రూప్, సంజీవ్ గోయెంకా గ్రూప్, నవీన్ జిందాల్ గ్రూప్, టోరెంటో ఫార్మా, అరబిందో ఫార్మా, హిందూస్థాన్ టైమ్స్ మీడియా సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. సాంకేతికంగా బిడ్ల పరిశీలన ఇప్పటికే పూర్తవగా, అక్టోబర్ 25న నూతన ప్రాంఛైజీల యజమానులను బోర్డు ప్రకటించనుంది. నూతన ప్రాంఛైజీలతో పాటు నూతన ప్రాంఛైజీ నగరాలను సైతం ప్రకటించేది లేనిది బోర్డు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ప్రాంఛైజీలకు కనీస ధర రూ.2000 కోట్లు నిర్ణయించగా.. రెండు ప్రాంఛైజీల బిడ్లతో సుమారు రూ.7000 కోట్ల ఆదాయం బీసీసీఐ ఆశిస్తోంది.