Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ఐపీఎల్ కొత్త ప్రాంఛైజీల ప్రకటన
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రెండు కొత్త ప్రాంఛైజీల ద్వారా బీసీసీఐ సుమారు రూ.7-10 వేల కోట్ల భారీ ఆదాయం ఆశిస్తోంది. ఐపీఎల్‌ను 8 జట్ల నుంచి పది జట్లకు విస్తరిస్తూ బీసీసీఐ ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రెండు నూతన ప్రాంఛైజీల కోసం టెండర్లు పిలువగా 22 బడా కార్పోరేట్ కంపెనీల నుంచి విశేష స్పందన లభించింది. మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ సహా యజమాని లాన్సెర్ గ్రూప్ సైతం ఐపీఎల్ ప్రాంఛైజీ కోసం టెండరు పత్రాలు కొనుగోలు చేసిందనే వార్తలతో మరింత ఆసక్తి రేగుతోంది. ఐపీఎల్ ప్రాంఛైజీల రేసులో ఆదానీ, ఆర్‌ఎస్‌పీజీ గ్రూప్‌లు ముందు నుంచీ ఆసక్తిగా ఉన్నాయి. కొటక్ గ్రూప్, అరబిందో ఫార్మా, టోరెంటో ఫార్మా గ్రూప్‌లు సైతం రేసులో ఉండటంతో నూతన ప్రాంఛైజీల ధర ఆకాశాన్నంటే అవకాశం కనిపిస్తోంది. ప్రాంఛైజీ కనీస ధర రూ.2 వేల కోట్లుగా నిర్ణయించారు. ఆరంభంలో రూ.3-3.5 వేల కోట్లు అంచనా వేసినా.. తాజాగా నూతన ప్రాంఛైజీలు రూ.3.5-5 వేల కోట్ల ధర పలికే అవకాశం కనిపిస్తోంది. రానున్న ఐదేండ్ల కాలానికి ప్రసార, డిజిటల్ హక్కుల అంచనా రూ. 36 వేల కోట్ల చేరటంతో కొత్త ప్రాంఛైజీల ధర పెరగనుందని తెలుస్తోంది. అక్టోబర్ 25న దుబాయ్‌లో బీసీసీఐ నూతన ప్రాంఛైజీలను ప్రకటించనుంది. ప్రాంఛైజీల ప్రకటనతో పాటు నూతన ప్రసార హక్కులకు సైతం టెండర్లు పిలువనుంది.