Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ జూనియర్ ప్రపంచ హాకీ టోర్నీ ప్రేక్షకుల్లేకుండానే జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నమెంట్ నవంబర్ 24నుంచి ప్రారంభం కానుండగా.. కోవిడ్-19 దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హాకీ ఇండియా(హెచ్ఐ) మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. భువనేశ్వర్‌లోని కలింగ స్టేడియంలో ఈ టోర్నమెంట్ డిసెంబర్ 5వరకు జరగనుంది. భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో మొత్తం 16జట్లు బరిలోకి దిగనున్నాయి. భారత్, అర్జెంటీనా, బెల్జియం, కెనడా, చిలీ, ఈజిప్ట్, ఫ్రాన్స్, జర్మనీ, కొరియా, మలేషియా, పాకిస్తాన్, పోలెండ్, దక్షిణాఫ్రికా, స్పెయిన్, నెదర్లాండ్తోపాటు అమెరికా కూడా ప్రాతినిధ్యం వహించనుంది. పూల్ మ్యాచ్‌లు నవంబర్ 30న ముగియనుండగా.. క్వార్టర్‌ఫైనల్ డిసెంబర్ 1న, సెమీఫైనల్స్ 3న, ఫైనల్ డిసెంబర్ 5న జరగనుంది. విదేశీ జట్ల ఆటగాళ్లకు క్వారంటైన్లో మినహాయింపును ఇవ్వడంతో అన్నిజట్లు బరిలోకి దిగనున్నాయి. మ్యాచ్ ప్రారంభానికి 72 గంటల ముందు ఆటగాళ్లందరికీ ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు జరగనున్నారు. భారత్ చేరిన వెంటనే విదేశీ ఆటగాళ్లకు విమానాశ్రయంలోనే కోవిడ్ పరీక్షలు చేయనున్నారు.