Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: టీమిండియా హెడ్‌కోచ్ పదవికి భారత మాజీ క్రికెటర్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ దరఖాస్తు చేశాడు. ద్రావిడ్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పూర్తిస్థాయి కోచ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల బిసిసిఐ కోచ్ పదవికి ద్రావిడ్ సరైనోడని తేల్చి చెప్పినా.. తొలుత నిరాకరించిన ద్రావిడ్.. ఆ తర్వాత కోచ్‌గా ఉండేందుకు సుముఖత వ్యక్తం చేశాడు. కోచ్ పదవికి దరఖాస్తు చేసుకొనేందుకు నేటితో ఆఖరిరోజు కాగా.. చివరిరోజు తన దరఖాస్తును పంపించాడు. ఇక టీమిండియా ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం టి20 ప్రపంచకప్ అనంతరం ముగియనుంది. న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు నవంబర్‌లో రానుంది. ఆ పర్యటననుంచి భారత క్రికెటర్ సీనియర్ పురుషుల జట్టుకు కోచ్‌గా ద్రావిడ్ ఉండనున్నాడు. టీమిండియా కోచ్ పదవికి ద్రావిడ్‌తోపాటు మరికొన్ని దరఖాస్తులు అందినా.. బిసిసిఐ అడ్వైజరీ కమిటీ ద్రావిడ్వైపే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశముంది.
బౌలింగ్ కోచ్ రేసులో మాంబ్రే
ఇక టీమిండియా వెటరన్ పేసర్ పరాస్ మాంబ్రే బౌలింగ్ కోచ్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా అండర్-19 యువ క్రికెట్ జట్టుకు, ఇండియా-ఏ జట్లకు బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన అనుభవం మాంబ్రేకు ఉంది. నేషనల్ క్రికెట్ అకాడమీలో రాహుల్ ద్రావిడ్ కలిసి పనిచేసిన అనుభవం మాంబ్రేకు 49ఏళ్ల మాంబ్రే భారతజట్టు తరఫున 1996-98లో 2 టెస్టులు, 3 వన్డేలు ఆడాడు. రంజీట్రోఫీలో ముంబయి జట్టుకు 1990లో ఆడిన మాంబ్రే.. 91 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచుల్లో 284వికెట్లు తీయగా.. 13సార్లు ఐదు వికెట్లు సాధించాడు.