Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిది వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై గెలుపు
- రెండో మ్యాచ్‌లోనూ ఓడిన డిఫెండింగ్ ఛాంపియన్
దుబాయ్: టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు బోణి కొట్టింది. మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టును 143 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం ఆ లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 144 పరుగులు చేసి విజయం సాధించింది. మార్క్రరమ్ 26 బంతుల్లో 2ఫోర్లు, 4 భారీ సిక్సర్ల సాయంతో 51 పరుగులు, డుస్సెన్ 43 పరుగులు చేసి సఫారీల గెలుపులో కీలకపాత్ర పోషించారు. జట్టు స్కోర్ నాలుగు పరుగుల వద్ద కెప్టెన్ బవుమా(2) రనౌట్‌గా వెనుదిరిగాడు. అంతకుముందు వెస్టిండీస్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 పరుగులు చేయగా, కెప్టెన్ కీరన్ పొలార్డ్ 26 పరుగులు చేశాడు. సిమన్స్ 16, పూరన్, క్రిస్ గేల్ చెరో 12 పరుగులు చేశారు. మిగిలినవారెవ్వరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ప్రెటోరియస్కు మూడు, కేశవ్ మహారాజ్‌కు రెండు, రబడా, నోర్ట్జేకు చెరో వికెట్ దక్కాయి. నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చిన నోర్ట్జేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
స్కోర్‌బోర్డు..
వెస్టిండీస్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ (బి)రబడా 16, లెవీస్ (సి)రబడా (బి)మహరాజ్ 56, పూరన్ (సి)మిల్లర్ (బి)మహరాజ్ 12, గేల్ (సి)క్లాసెన్ (బి)ప్రిటోరియస్ 12, పొలార్డ్ (సి)డుస్స్ె (బి)ప్రెటోరియస్ 26, రస్సెల్ (బి)నోర్ట్జే 5, హెట్మెయిర్ (రనౌట్) మిల్లర్/క్లాసెన్ 1, బ్రేవో (నాటౌట్) 8, వాల్ష్ (సి)హెండ్రిక్స్ (బి)ప్రెటోరియస్ 0, హొసైన్ (నాటౌట్) 0, అదనం 7. (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 143 పరుగులు.
వికెట్ల పతనం: 1/73, 2/87, 3/89, 4/121, 5/132, 6/133, 7/137, 8/137
బౌలింగ్: మార్క్రరమ్ 3-1-22-0, రబడా 4-0-27-1, నోర్ట్జే 4-0-14-1, మహరాజ్ 4-0-24-2, షాంసీ 3-0-27-0, ప్రెటోరియస్ 2-0-17-3.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: బవుమా (రనౌట్) రస్సెల్ 2, హెండ్రిక్స్ (సి)హెట్మెయిర్ (బి)హొసైన్ 39, డుస్సెన్ (నాటౌట్) 43, మార్క్రరమ్ (నాటౌట్) 51, అదనం 9. (18.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి) 144పరుగులు.
వికెట్ల పతనం: 1/4, 2/61.
బౌలింగ్: హొసైన్ 4-0-27-1, రాంపాల్ 3-0-22-0, రస్సెల్ 3.2-0-36-0, వాల్ష్ 3-0-26-0, బ్రేవో 4-0-23-0, పొలార్డ్ 1-0-9-0