Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూజిలాండ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపు
షార్జా: టి20 ప్రపంచకప్ పాకిస్తాన్ జట్టు మరో విజయాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను పాక్ బౌలర్లు కట్టడి చేశారు. హరీస్ రౌఫ్(4/22) దెబ్బకు కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 134 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఆ లక్ష్యాన్ని పాకిస్తాన్ జట్టు 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ రిజ్వాన్(33), షోయబ్ మాలిక్(26నాటౌట్), ఆసిఫ్ అలీ(27నాటౌట్) పాకిస్తాన్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను మిచెల్ (27), కాన్వే(27), కేన్ విలియమ్సన్ (25) ఫర్వాలేదనిపించారు. మిగతావారు విఫలమవడంతో న్యూజిలాండ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. దీంతో పాక్ వరుసగా రెండు విజయాలు సాధించి 4పాయింట్లతో గ్రూప్-2లో అగ్రస్థానంలో నిలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రౌఫ్‌కు దక్కింది.
స్కోర్‌బోర్డు..
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గుప్తిల్ (బి)రౌఫ్ 17, మిఛెల్ (సి)ఫకర్ (బి)ఇమద్ 27, విలియమ్సన్ (రనౌట్) హసన్ అలీ 25, నీషమ్ (సి)ఫఖర్ (బి)హఫీజ్ 1, కాన్వే (సి)బాబర్ (బి)రౌఫ్ 27, ఫిలిప్స్ (సి)హసన్ (బి)రౌఫ్ 13, షెఫర్ట్ (సి)హఫీజ్ (బి)అఫ్రిది 8, సాంట్నర్ (బి)రౌఫ్ 6, సోథీ (నాటౌట్) 2, అదనం 8. (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 134 పరుగులు.
వికెట్ల పతనం: 1/36, 2/54, 3/56, 4/90, 5/116, 6/116, 7/125, 8/134.
బౌలింగ్: అఫ్రిది 4-1-21-1, ఇమద్ వాసిం 4-0-24-1, హసన్ అలీ 3-0-26-0, రౌఫ్ 4-0-22-4, షాదాబ్ ఖాన్ 3-0-19-0, హఫీజ్ 2-0-16-1.
పాకిస్తాన్ ఇన్నింగ్స్: మహ్మద్ రిజ్వాన్ (ఎల్బి) సోథీ 33, బాబర్ అజమ్ (బి)సౌథీ 9, ఫఖర్ జమాన్ (ఎల్బి)సోథీ 11, హఫీజ్ (సి)కాన్వే (బి)సాంట్నర్ 11, షోయబ్ మాలిక్ (నాటౌట్) 26, ఇమద్ వాసిం (ఎల్బి) బౌల్ట్ 11, ఆసిఫ్ అలీ (నాటౌట్) 27, అదనం 7. (18.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 135 పరుగులు.
వికెట్ల పతనం: 1/28, 2/47, 3/63, 4/69, 5/87
బౌలింగ్: సాంట్నర్ 4-0-33-1, సౌథీ 4-0-25-1, బౌల్ట్ 3.4-0-29-1, నీషమ్ 3-0-18-0, సోథీ 4-0-29-2.