Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్
పారిస్: పురుషుల సింగిల్స్ మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ అద్భుత పోరాటంతో ఆకట్టుకున్నాడు. కొంతకాలంగా ఫామ్ కోల్పోయిన శ్రీకాంత్ ఫ్రెంచ్ ఓపెన్‌లో వరల్డ్ నం.1 జపాన్ షట్లర్ కెంటో మోమోట చేతిలో 1-2తో ఓటమి చెందాడు. గత వారం డెన్మార్క్ ఓపెన్‌లోనూ మోమోట చేతిలో ఓడిన శ్రీకాంత్ పారిస్‌లో పట్టుదలగా ఆడాడు. 79 నిమిషాల హోరాహోరీ పోరులో 18-21, 22-20, 19-21తో శ్రీకాంత్‌పై మోమోట పైచేయి సాధించాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో శ్రీకాంత్ రెండు పాయింట్ల ముందంజలో నిలిచినా మోమోట గొప్పగా పుంజుకున్నాడు. 21-19తో మూడో గేమ్, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్, అశ్విని జంట 21-19, 21-15తో డెన్మార్క్ జోడీపై గెలుపొందారు. పురుషుల సింగిల్స్‌లో హెచ్.ఎస్ ప్రణరు 11-21, 14-21తో చెన్ చేతిలో, పారుపల్లి కశ్యప్ 17-21, 21-17చ 11-21తో బ్రైస్ చేతిలో ఓటమి చెందారు. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ గాయంతో తప్పుకుంది. సయకతో మ్యాచ్‌లో 11-21, 2-9తో వెనుకంజలో నిలిచిన సైనా వాకోవర్ ఇచ్చింది. అగ్రశ్రేణి షట్లర్ పి.వి సింధు 21-15, 21-18తో జూలీ (డెన్మార్క్)పై వరుస గేముల్లో గెలుపొందింది.