Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ చాంపియన్‌గా తెలంగాణ బాక్సర్
హైదరాబాద్: వర్థమాన బాక్సింగ్ సంచలనం, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పసిడి పంచ్ విసిరింది. వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్స్ స్వర్ణం, ఆసియా చాంపియన్‌షిప్స్‌లో కాంస్యం సాధించిన నిఖత్ జరీన్ తొలిసారి జాతీయ బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచింది. మహిళల 52 కేజీల విభాగంలో హర్యానా బాక్సర్ మీనాక్షిపై నిఖత్ జరీన్ 4-1తో ఏకపక్ష విజయం సాధించింది. జాతీయ చాంపియన్‌షిప్ ప్రతి బౌట్లోనూ ప్రత్యర్థిపై ఎదురులేని ఆధిపత్యం చూపించిన నిఖత్ జరీన్.. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ బెర్త్‌ను సైతం సొంతం చేసుకుంది. 66 కేజీల విభాగంలో మరో తెలంగాణ బాక్సర్ నిహారిక సెమీఫైనల్లో 1-4తో పరాజయం చవిచూసినా కాంస్య పతకం అందుకుంది. 'కోవిడ్ పరిస్థితుల్లో ఇంటి దగ్గర సాధన కష్టమైంది. కఠోర శ్రమకు ప్రతిఫలం లభించింది. నా ప్రదర్శన పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. జాతీయ చాంపియన్‌షిప్ నెగ్గాలని అనుకున్నాను. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మెడల్ కోసం కష్టపడతాను' అని నిఖత్ జరీన్ తెలిపింది. జాతీయ చాంపియన్‌గా నిలువటంతో.. ఉత్తమ బాక్సర్ అవార్డును సైతం నిఖత్ జరీన్నే వరించింది