Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లాదేశ్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
అబుదాబి: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ దూసుకెళ్తోంది. సూపర్12 గ్రూప్-1 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 14.1 ఓవర్లలోనే ఇంగ్లాండ్ ఛేదించింది. ఓపెనర్ జేసన్ రారు (61, 38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ అర్థ సెంచరీతో బంగ్లాదేశ్‌పై విరుచుకుపడ్డాడు. రారుతో పాటు డెవిడ్ మలాన్ 928 నాటౌట్, 25 బంతుల్లో 3 ఫోర్లు), జోశ్ బట్లర్ (18, 18 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), జానీ బెయిర్‌స్టో (8 నాటౌట్) రాణించటంతో ఇంగ్లాండ్ చెమట పట్టకుండా వరుసగా రెండో విజయం సాధించింది. వరుస విజయాలతో గ్రూప్-1లో సెమీఫైనల్ బెర్త్‌కు ఇంగ్లాండ్ మరింత చేరువైంది. ఇంగ్లాండ్ బౌలర్లు మిల్స్ (3/27), లివింగ్‌స్టోన్ (2/15), అలీ (2/18) విజృంభించటంతో తొలుత బంగ్లాదేశ్ 124/9 పరుగులే చేసింది. ముష్ఫీకర్ రహీం (29), మహ్మదుల్లా (19), అహ్మద్ (19) బంగ్లాను ఆదుకున్నారు.