Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్: విధ్వంసక బ్యాటర్, ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డెవిడ్ వార్నర్ (65, 42 బంతుల్లో 10 ఫోర్లు) ఫామ్‌లోకి వచ్చాడు. ఐపీఎల్లో పేలవ ఫామ్‌తో సన్‌రైజర్స్ జట్టులో చోటు కోల్పోయిన వార్నర్.. వరల్డ్‌కప్ వార్మప్, ఆరంభ మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. టీ20 ప్రపంచకప్ సూపర్12 గ్రూప్-1 మ్యాచ్‌లో శ్రీలంకపై ధనాధన్ అర్ధ సెంచరీతో ఆస్ట్రేలియాకు 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందించాడు. 31 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదిన డెవిడ్ వార్నర్ శ్రీలంక బౌలర్లపై మునుపటి స్థాయిలో దండెత్తాడు. కెప్టెన్ అరోన్ ఫించ్ (37)తో కలిసి తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించిన వార్నర్.. స్టీవ్ స్మిత్ (28 నాటౌట్)తో కలిసి మూడో వికెట్‌కు మరో 50 పరుగులు జోడించాడు. 155 పరుగుల ఛేదనలో ఆసీస్‌కు అలవోక విజయాన్ని అందించాడు. 17 ఓవర్లలోనే 155/3తో ఆసీస్ లాంఛనం ముగించింది. చరిత్ (35), కుశాల్ (35), భానుక (33) రాణించటంతో తొలుత శ్రీలంక 154/6 పరుగులు చేసింది.