Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వార్టర్స్‌లో బుసానన్‌పై గెలుపు
- ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్
పారిస్: తెలుగు తేజం, ఒలింపిక్ మెడలిస్ట్ పి.వి సింధు ఫామ్‌లోకి వచ్చింది!. డెన్మార్క్ ఓపెన్‌లో విఫలమైన సింధు పారిస్‌లో అదరగొడుతోంది. థారులాండ్ షట్లర్ బుసానన్‌పై వరుస గేముల్లో విజయంతో మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మూడో సీడ్ సింధు 21-14, 21-14తో 38 నిమిషాల్లోనే సెమీస్ బెర్త్ సొంతం చేసుకుంది. తొలి గేమ్‌లో 11-6తో విరామ సమయానికి భారీ ఆధిక్యంలో నిలిచిన సింధు.. ద్వితీయార్థంలో 13-7 నుంచి వరుసగా ఐదు పాయింట్లు సాధించింది. 18-7తో తొలి గేమ్‌ను లాంఛనం చేసుకుంది. రెండో గేమ్‌లో 8-8తో స్కోర్లు సమంగా ఉన్న సమయంలో 11-8తో విరామ సమయానికి ముందంజ వేసిన సింధు అదే జోరు కొనసాగించింది. 15-10తో బుసానన్‌పై తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. నేడు జరిగే సెమీఫైనల్ సమరంలో అన్‌సీడెడ్ జపాన్ షట్లర్ సయాక టకహసితో సింధు తలపడనుంది. రెండో సీడ్ రచనాక్ ఇంటనాన్ (థారులాండ్)పై 21-6, 21-16తో టకహసి మెరుపు విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ యువ సంచలనం లక్ష్యసేన్ పోరాడి ఓడాడు. 43 నిమిషాల క్వార్టర్ఫైనల్లో 17-21, 15-21తో కొరియా షట్లర్ చేతిలో ఓటమి చెందాడు.