Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసీస్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
దుబాయ్ : స్వల్ప స్కోర్ల టీ20 వరల్డ్‌కప్‌లో తొలిసారి బ్యాటింగ్ ధనాధన్. ఇంగ్లాండ్ ఓపెనర్ జోశ్ బట్లర్ (71 నాటౌట్, 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆసీస్ బౌలర్లపై పంజా విసిరాడు. 25 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన బట్లర్.. 126 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్‌కు అలవోక విజయాన్ని అందించాడు. సిక్సర్లు, ఫోర్లతోనే 50 పరుగులు పిండుకున్న బట్లర్ 11.4 ఓవర్లలోనే లాంఛనం ముగించాడు. జేసన్ రారు (22), జానీ బెయిర్‌స్టో (16 నాటౌట్) రాణించారు. 20 ఓవర్లలో 130-140 పరుగులు తంటాలు పడుతున్న చోట ఇంగ్లాండ్ భిన్నమైన ప్రదర్శన చేసింది. జోశ్ బట్లర్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ అరోన్ ఫించ్ (44), ఆష్టన్ ఆగర్ (20), మాథ్యూ వేడ్ (18) ఆదుకోవటంతో తొలుత ఆస్ట్రేలియా 125 పరుగులకు కుప్పకూలింది. గ్రూప్-1లో వరుసగా మూడో విజయం సాధించిన ఇంగ్లాండ్ సెమీఫైనల్స్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది.