Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ20 ప్రపంచకప్‌కు దూరం
దుబాయ్ : సూపర్12 దశలో గెలుపు రుచి చూసేందుకు నానా తంటాలు పడుతున్న బంగ్లాదేశ్‌కు గట్టి ఎదురుదెబ్బ. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు షకిబ్ అల్ హసన్ దూరమయ్యాడు. తొడ కండరం గాయంతో షకిబ్ అల్ హసన్ ప్రపంచకప్‌లో మిగిలన మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ తెలిపింది. గ్రూప్-1లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో షకిబ్ అల్ హసన్ గాయానికి గురయ్యాడు. 48 గంటల వైద్యుల పర్యవేక్షణ, స్కానింగ్ నివేదికల అనంతరం షకిబ్ ప్రపంచకప్‌కు దూరమైతున్నట్టు జట్టు డాక్టర్ వెల్లడించాడు. ' వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ షకిబ్ ఎడమ కాలి తొడ కండరం గాయానికి గురయ్యాడు. వైద్య పరీక్షల్లో గాయం గ్రేడ్-1గా నిర్దారణ అయ్యింది. వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ చివరి రెండు మ్యాచులకు షకిబ్ అందుబాటులో ఉండటం లేదు' అని డాక్టర్ తెలిపాడు. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచుల్లో బంగ్లాదేశ్ ఓటమి చెందింది. చివరి రెండు మ్యాచుల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలతో బంగ్లాదేశ్ తలపడనుంది.