Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలంకపై ఇంగ్లాండ్ గెలుపు
షార్జా : జోశ్ బట్లర్ (101 నాటౌట్, 67 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతకబాదాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్సర్ బాదిన బట్లర్ 67 బంతుల్లో టీ20ల్లో కెరీర్ తొలి సెంచరీ నమోదు చేశాడు. 45 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన బట్లర్, ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నెమ్మదైన పిచ్‌పై సహచర బ్యాటర్లు ఇబ్బంది పడిన చోట బట్లర్ ధనాధన్‌తో కదం తొక్కాడు. జేసన్ రారు (9), మలాన్ (6), బెయిర్‌స్టో (0) విఫలమైనా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (40, 36 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించటంతో తొలుత ఇంగ్లాండ్ 163/4 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో శ్రీలంక పోరాడి ఓడింది. వరుస వికెట్లు కూలినా.. లంక లక్ష్యం దిశగా ప్రయత్నాలు చేసింది. చరిత్ (21), రాజపక్సె (26), శనక (26), వానిందు (34) మెరిసినా ఆ జట్టు 19 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంకపై 26 పరుగుల తేడాతో గెలుపొందిన ఇంగ్లాండ్ గ్రూప్-2లో నాల్గో విజయంతో సెమీఫైనల్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.