Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీఫైనల్లో అడుగు.. పతకం ఖాయం
- ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్
బెల్గ్రేడ్ (సెర్బియా) : యువ బాక్సర్, తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఆడుతున్న ఆకాశ్ కుమార్ సంచలనం సృష్టించాడు. అరంగ్రేటంలోనే అదిరిపోయే పంచ్ విసిరాడు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ (మెన్స్) 54 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో జరుగుతున్న మెగా టోర్నీలో ఆకాశ్ కుమార్ పతకం ఖాయం చేసుకున్నాడు. మంగళవారం ఇక్కడ జరిగిన క్వార్టర్‌ఫైనల్ సమరంలో ఒలింపిక్ మాజీ సిల్వర్ మెడలిస్ట్‌పై ఎదురులేని విజయం సాధించాడు. ప్రతిష్టాత్మక ఈవెంట్లో భారత్‌కు తొలి పతకం ఖాయం చేశాడు. 21 ఏండ్ల ఆకాశ్ కుమార్ క్వార్టర్ఫైనల్లో 5-0తో ఏకపక్ష విజయం సాధించాడు. కండ్లుచెదిరే ప్రదర్శనతో సెమీఫైనల్లోకి చేరుకుని కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకున్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్ పతకంతో పాటు కనీసం రూ.18 లక్షల నగదు బహుమతి సైతం ఆకాశ్ లాంఛనం చేసుకున్నాడు. పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో రాటుదేలిన ఆకాశ్ కుమార్ ఈ ఏడాది జాతీయ చాంపియన్‌గా అవతరించాడు. సర్వీసెస్ బాక్సర్‌గా జాతీయ బాక్సింగ్ రింగ్‌లో సత్తా చాటిన ఆకాశ్ నేరుగా వరల్డ్ చాంపియన్‌షిప్ బెర్త్ బుక్ చేసుకున్నాడు. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన వెనుజులా బాక్సర్ యోల్ ఫినోల్ రివాస్పై అద్భుత విజయం నమోదు చేశాడు. రింగ్‌లో భయం లేకుండా లేకుండా చెలరేగిన ఆకాశ్ కుమార్.. ఊహించని రీతిలో ఎదురుదాడి చేశాడు. గార్డ్ చేసుకుంటూ రివాస్పై పంచ్‌ల వర్షం కురిపించాడు. మంచి ఫుట్‌వర్క్, మెరుపు పంచ్‌లతో ఆకాశ్ కుమార్ సరికొత్తగా కనిపించాడు. ఆకాశ్ పంచ్‌లకు రివాస్ వద్ద సమాధానం లేకపోయింది. నేడు జరిగే సెమీఫైనల్ బౌట్లో ఆకాశ్ కుమార్‌తో కజకిస్థాన్ బాక్సర్ ఢకొీట్టనున్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పతకాలు సాధించిన విజేందర్ సింగ్ (2009), వికాశ్ క్రిషన్ (2011), శివ థాప (2015), గౌరవ్ బిదురి (2017), అమిత్ పంఘాల్ (2019), మనీశ్ కౌశిక్ (2019) తర్వాత ఈ ఘనత వహించిన బాక్సర్‌గా ఆకాశ్ కుమార్ నిలువనున్నాడు.