Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐకి కపిల్‌దేవ్ సూచన
న్యూఢిల్లీ : టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్ అవకాశాలు ఇతర జట్ల మ్యాచుల ఫలితాలపై ఆధారపడటం అభిమానులకు మింగుడు పడని అంశమని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. జట్టులో స్టార్స్‌ను తప్పించి, యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని బోర్డుకు సూచించాడు. ' మన పురోగతి ఇతరుల ప్రదర్శనపై ఆధారపడటం భారత క్రికెట్ ఎన్నడూ హర్షించదు. ప్రపంచకప్ సెమీస్‌కు చేరాలంటే అది సొంత బలంతో చేరుకోవాలి. సెలక్టర్లు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయం తీసుకోవాలి. ఐపీఎల్లో నిలకడగా రాణిస్తోన్న క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలి. కుర్ర జట్టు ఓడినా ఫర్వాలేదు, అనుభవమైనా వస్తుంది. స్టార్ క్రికెటర్లు ఇంత దారుణంగా ఆడితే విమర్శలు వెల్లువెత్తుతాయి. బీసీసీఐ జోక్యం చేసుకుని కుర్రాళ్లను జట్టులోకి తీసుకోవాలి' అని కపిల్ దేవ్ అన్నారు.