Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్కాట్లాండ్పై కివీస్ గెలుపు
దుబాయ్ : మార్టిన్ గప్టిల్ (93, 56 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) ధనాధన్ మెరుపులతో న్యూజిలాండ్ మరో విజయం సాధించింది. స్కాట్లాండ్పై 16 పరుగుల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్ టీ20 ప్రపంచకప్ గ్రూప్-2లో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. స్కాట్లాండ్ బౌలర్లు రాణించటంతో తొలుత న్యూజిలాండ్ 6 ఓవర్లలో 52/2, 10 ఓవర్లలో 70/3తో ఒత్తిడిలో పడింది. మార్టిన్ గప్టిల్ వీరోచిత బ్యాటింగ్ ప్రదర్శన కివీస్‌ను భారీ స్కోరు దిశగా తీసుకెళ్లింది. చివరి 60 బంతుల్లో 102 పరుగులు సాధించిన కివీస్ తొలుత 172 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో స్కాట్లాండ్ పోరాట స్ఫూర్తి కనబరిచింది. మున్సె (22), కైల్ (17), మాథ్యూ (27), బెరింగ్టన్ (20), మైకల్ (42 నాటౌట్, 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) గట్టిగా పోరాడారు. నిర్ణీత ఓవర్లలో 156 పరుగులే చేసిన స్కాట్లాండ్.. పోరాడి ఓడింది. మార్టిన్ గప్టిల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
స్కోరు వివరాలు :
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : 172/5 (మార్టిన్ గప్టిల్ 93, ఫిలిప్స్ 33, షరిఫ్ 2/28)
స్కాట్లాండ్ ఇన్నింగ్స్ : 156/5 (మైకల్ లీస్క్ 42, మాథ్యూ క్రాస్ 27, బౌల్ట్ 2/29)