Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఏసీ ఏకగ్రీవ నియామకం
- కివీస్‌తో సిరీస్ నుంచే బాధ్యతలు
ముంబయి : 'ది వాల్' రాహుల్ ద్రవిడ్ భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. సులక్షణ నాయక్, ఆర్పీ సింగ్‌లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ద్రవిడ్‌ను తదుపరి చీఫ్ కోచ్గాఎంపిక చేస్తూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగనున్న సిరీస్‌తో రాహుల్ ద్రవిడ్ చీఫ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రస్తుత చీఫ్ కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది. నూతన చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా స్వాగతం పలికారు. ' భారత క్రికెట్ చీఫ్ కోచ్‌గా ఎంపిక కావటం గౌరవంగా భావిస్తున్నాను. ఈ బాధ్యత పట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. రవిశాస్త్రి కోచ్‌గా భారత జట్టు మంచి ప్రదర్శన చేసింది, జట్టుతో కలిసి పని చేసి మరింత ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తున్నాను. ఎన్సీఏ, అండర్-19, భారత్-ఏ జట్టు తరఫున క్రికెటర్లతో పని చేసిన అనుభవం పనికొస్తుందని అనుకుంటున్నాను. రానున్న రెండేండ్లలో మెగా టోర్నీలు రానున్నాయి. ఆటగాళు, సహాయక సిబ్బందితో కలిసి లక్ష్యాలు చేరుకునేందుకు కృషి చేస్తానని' రాహుల్ ద్రవిడ్ అన్నారు. భారత క్రికెట్ జట్టు (మెన్స్) చీఫ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ రెండేండ్లు కొనసాగనున్నారు.