Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అబుదాబి: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వైన్ బ్రేవో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాతో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌నుంచి పూర్తిగా వైదొలగనున్నట్లు తెలిపాడు. తన రాజీనామా లేఖను ఐసిసికి, వెస్టిండీస్ క్రికెట్‌బోర్డుకు ట్విటర్ వేదికగా తెలిపాడు. ఈ సందర్భంగా 38ఏళ్ల బ్రేవో.. సుదీర్ఘ కెరీర్లో భాగంగా తాను కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. తనకు సహకరించిన క్రికెట్ బోర్డు, ఐసిసి, కరేబియన్ ప్రజలకు ట్విటర్లో కృతజ్ఞతలు తెలిపాడు. 2006లో అక్లాండ్లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా టి20ల్లో అరంగేట్రం చేసిన బ్రేవో.. 90 మ్యాచుల్లో 22.23 యావరేజ్‌తో 1,245పరుగులు చేశాడు. మీడియం పేసర్‌గా 78 వికెట్ల తీసాడు. వెస్టిండీస్ జట్టు 2012, 2016లో టి20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టు ఈసారి నిరాశాజనక ప్రదర్శనతో సెమీఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఆదివారం శ్రీలంక చేతిలో ఓటమితో వెస్టిండీస్ జట్టు సెమీస్ ఆశలు గల్లంతయిన విషయం తెలిసిందే.