Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఫెన్సింగ్ సంఘం అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ రెడ్డి
హైదరాబాద్: ఈనెల 12 నుంచి 14 వరకు అంతర్ జిల్లాల ఫెన్సింగ్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్‌లోని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ పోటీలను నిర్వహించనున్నామని మర్రి చెప్పారు. సబ్ జూనియర్ అండర్-14, క్యాడెట్ అండర్-17, జూనియర్ అండర్-20 టీమ్ విభాగాల్లో బాలబాలకలకు విడివిడిగా పోటీలు జరపనున్నామని వెల్లడించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారిని ఈనెల 27 నుంచి 30 వరకు హరియాణాలో జరగనున్న జాతీయ జూనియర్ ఫెన్సింగ్ చాంపియనషిప్‌కు ఎంపిక చేయనున్నామని మర్రి చెప్పారు. ఇక, గుర్తింపు లేని కొన్ని సంఘాలు నిర్వహిస్తున్న ఫెన్సింగ్ పోటీలతో జాతీయ, రాష్ట్ర ఫెన్సింగ్ సంఘానికి, భారత ఒలింపిక్ అసోసియేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని.. క్రీడాకారులు ఈ విషయాన్ని గమనించాలని మర్రి విజ్ఞప్తి చేశారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు విధిగా తమ ఆధార్ కార్డు జిరాక్స్‌తో పాటు నాలుగు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను పోటీల వేదిక వద్ద నిర్వాహకులకు అందజేయాల్సి ఉందని రాష్ట్ర ఫెన్సింగ్ సంఘం కోశాధికారి సందీప్ తెలిపారు.