Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వడోధర: సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్ రెండో లీగ్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు పరాజయం పాలైంది. ఎలైట్ గ్రూప్-సి ఆంధ్ర జట్టు 6 వికెట్ల తేడాతో హర్యానా చేతిలో ఓడింది. శుక్రవారం జరిగిన పోటీలో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. కెప్టెన్ భరత్(2) నిరాశపర్చినా.. అశ్విన్ హెబ్బర్(103నాటౌట్) అజేయ సెంచరీతో కదం తొక్కాడు. నితీశ్ రెడ్డి 41 పరుగులు చేశాడు. అనంతరం హర్యానా జట్టు 17.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసి విజయం సాధించింది. శివమ్ చౌహాన్(45నాటౌట్), తెవాటియా(46నాటౌట్() హర్యానా గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఇక గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆంధ్ర 36 పరుగుల తేడాతో జమ్మూ-కాశ్మీర్‌ను చిత్తుచేసింది.