Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్కాట్లాండ్పై 8 వికెట్ల తేడాతో భారత్ విజయం
- 18బంతుల్లోనే కేఎల్ రాహుల్ అర్ధసెంచరీ
- బౌలింగ్‌లో మెరిసిన జడేజా, షమీ
దుబాయ్: నిర్ణయాత్మక పోటీలో భారత ఓపెనర్లు చెలరేగారు. పసికూన స్కాట్లాండ్ నిర్దేశించిన 86 పరుగుల లక్ష్య ఛేదనలో కేఎల్ రాహుల్(50)కి తోడు రోహిత్ శర్మ(30) కలిసి తొలి 30 బంతుల్లోనే 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వీరిద్దరూ ఔటైనా.. కోహ్లి, సూర్యకుమార్ కలిసి మిగతా పని పూర్తిచేశారు. దీంతో భారత్ కేవలం 39 బంతుల్లోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 17.4 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌట్ కాగా... 86 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 6.3 ఓవర్లలోనే ఊదిపారేసింది. కేఎల్ రాహుల్ 19 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్ల సాయంతో 50 పరుగులు, రోహిత్ శర్మ 16 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 30 పరుగులు చేశాడు. వీరిద్దరూ అవుటైనా కెప్టెన్ కోహ్లీ (2నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (6నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు. ఈ విజయంతో టీమిండియా 4పాయింట్లతో గ్రూప్-2లో మూడో స్థానానికి ఎగబాకింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జడేజా(3/15)కి తోడు షమీ(3/15), బుమ్రా)2/10) బౌలింగ్‌లో మెరిసారు.
సెమీస్ రేసులో మూడుజట్లు..
ప్రస్తుతం గ్రూప్-2లో అన్ని జట్లు నాలుగేసి మ్యాచ్‌లు ఆడాయి. పాక్ జట్టు 4మ్యాచ్‌లు ఆడి 8 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా, కివీస్ 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు నమోదు చేసుకొని 6పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక భారత్ 4 మ్యాచ్‌ల్లో 2విజయాలతో 4 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. ఆప్ఘనిస్తాన్ జట్టు 4 మ్యాచుల్లో 2 విజయాలు, 4 పాయింట్లతో నాల్గో స్థానంలో కొనసాగుతుంది. దీంతో పాకిసాన్ 8 పాయింట్లతో ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోగా.. మరో బెర్తు కోసం న్యూజిలాండ్, భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. ఆదివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌ను బట్టి సమీకరణలు మారనున్నాయి. న్యూజిలాండ్ జట్టు 7న ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌లో ఓడితే.. ఆఫ్ఘనిస్తాన్‌కు 6పాయింట్లు వస్తాయి. టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్‌ను నవంబరు 8న నమీబియాతో ఆడనుంది. ఆ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే 3జట్లకు 6పాయింట్లు ఉంటాయి. దీంతో అత్యధిక రన్‌రేట్ ఉన్న జట్టు సెమీస్‌కు చేరే అవకాశముంది. ఒకవేళ న్యూజిలాండ్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడిస్తే భారత్ అవకాశాలకు తెరపడినట్టే.
స్కోర్‌బోర్డు..
స్కాట్లాండ్ ఇన్నింగ్స్: మన్సే (సి)హార్దిక్ (బి)షమీ 24, కొయెట్జర్ (బి)బుమ్రా 1, క్రాస్ (ఎల్బి) జడేజా 2, బెర్రింగ్టన్ (బి)జడేజా 0, లీడ్ (బి)షమీ 16, లిస్క్ (ఎల్బి)జడేజా 21, గ్రేవ్స్ (సి)హార్దిక్ (బి)అశ్విన్ 1, వాట్ (బి)బుమ్రా 14, షరీఫ్ (రనౌట్) ఇషన్ కిషన్ 0, ఇవాన్స్ (బి)షమీ 0, వీల్ (నాటౌట్) 2, అదనం 4. (17.4 ఓవర్లలో ఆలౌట్) 85పరుగులు.
వికెట్ల పతనం: 1/13, 2/27, 3/28, 4/29, 5/58, 6/83, 7/81, 8/81, 9/81, 10/85
బౌలింగ్: బుమ్రా 3.4-1-10-2, వరుణ్ చక్రవర్తి 3-0-15-0, అశ్విన్ 4-0-29-1, షమీ 3-1-15-3, జడేజా 4-0-15-3
భారత్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి)లీడ్ (బి)వాట్ 50, రోహిత్ (ఎల్బి) వీల్ 30, కోహ్లి (నాటౌట్) 2, సూర్యకుమార్ (నాటౌట్) 6, అదనం. 1. (6.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి) 89 పరుగులు.
వికెట్ల పతనం: 1/70, 2/82.
బౌలింగ్: వాట్ 2-0-20-1, వీల్ 2-0-32-1, ఇవాన్స్ 1-0-16-0, షరీఫ్ 1-0-14-0, గ్రీవ్స్ 0.3-0-7-0.