Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రూప్ దశలో మూడు బలహీన జట్లతో తలపడాల్సిన పరిస్థితుల్లో గ్రూప్-2 సెమీస్ రేసు చావోరేవోగా తయారైంది. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్ నడుమ మ్యాచుల్లోనే రెండు సెమీఫైనల్ బెర్తులు తేలిపోయాయి. ఆ మ్యాచుల్లో నిరాశపరిచిన టీమ్ ఇండియా ఇప్పుడు అఫ్గనిస్థాన్‌పై ఆశలు పెట్టుకుంది. గ్రూప్-2లో నాలుగు విజయాలతో పాకిస్థాన్ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. మూడు విజయాలతో న్యూజిలాండ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. రెండు విజయాలు సాధించిన భారత్.. 1.619 నెట్ రన్‌రేట్‌తో ఆశలు సజీవంగా నిలుపుకుంది. న్యూజిలాండ్ నెట్‌రన్‌రేట్ 1.277 కాగా, అఫ్గనిస్థాన్ నెట్‌రన్‌రేట్ 1.481. గ్రూప్-2లో శనివారం న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్ మధ్య కీలక మ్యాచ్‌తో భారత్ భవితవ్యం తేలిపోనుంది. ఈ మ్యాచ్‌లో అఫ్గనిస్థాన్ విజయం సాధించాలని భారత్ కోరుకుంటోంది. సోమవారం నమీబియాతో మ్యాచ్‌లోనూ కోహ్లిసేన ఇదే తరహాలో భారీ విజయం సాధిస్తే మంచి నెట్ రన్‌రేట్ ఆధారంగా భారత్ ముందడుగు వేయనుంది. ఒకవేళ అఫ్గనిస్థాన్‌పై న్యూజిలాండ్ విజయం సాధిస్తే.. ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా పాక్‌తో పాటు కివీస్ సెమీఫైనల్‌కు చేరనుంది. నమీబియాతో మ్యాచ్‌కు ముందే భారత్ సెమీస్ ఆశలపై స్పష్టత రానుంది.