Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాత్యహంకార వ్యాఖ్యల ఫలితం
లండన్ : ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత మైకల్ వాన్‌పై వేటు పడింది. జాత్యహంకార వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ తమ రేడియో షో వ్యాఖ్యాతగా వాన్‌ను తొలగించింది. ఈ మేరకు బీబీసీ ప్రకటించింది. టెస్టు మ్యాచ్ స్పెషల్ షోకు మైకల్ వాన్ 12 ఏండ్లుగా బీబీసీ రేడియో షో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. 2009లో యార్క్‌షైర్ కౌంటీ క్లబ్ తరఫున ఆడుతున్న సమయంలో ఆసియా క్రికెటర్లను ఉద్దేశించి మైకల్ వాన్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్టు క్రికెటర్ అజీమ్ రఫీక్ ఆరోపించారు. యార్క్‌షైర్ తరఫున ఆడిన మరో క్రికెటర్ సైతం మైకల్ వాన్ జాతి వివక్ష వైఖరిపై ఆరోపణలు చేశాడు. దీంతో జాత్యహంకారి మైకల్ వాన్‌ను బీబీసీ తొలగించింది. ' పదేండ్ల క్రితం మాట్లాడిన మాటలు అంత గుర్తుకు లేవని, జాత్యంహకార పూరిత వ్యాఖ్యలు చేయలేదని అనుకుంటున్నాను. నేను ఆ వ్యాఖ్యలు చేశానని రఫీక్ అనుకుంటే.. అలాగే కానివ్వండి' అంటూ ఓ పత్రికకు రాసిన వ్యాసంలో మైకల్ వాన్ ఆరోపణలను తోసిపుచ్చారు.