Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రెసిడెంట్ కప్ షూటింగ్
న్యూఢిల్లీ : తొట్టతొలి ఐఎస్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ కప్‌లో భారత యువ షూటర్ మను భాకర్ గురి అదిరింది. ఒలింపిక్ చాంపియన్, ఇరాన్ స్టార్ షూటర్ జావెద్ ఫోరోహితో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ జట్టు విభాగంలో బరిలో నిలిచిన మను భాకర్ పసిడి పతకం సాధించింది. పసిడి షూటౌట్లో ఫ్రెంచ్-రష్యన్ జోడీపై మను భాకర్, జావెద్ జంట 16-8తో ఆధిపత్యం చూపింది. అర్హత రౌండ్లో 582 (600) పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన మను భాకర్ జోడీ.. తొలి సెమీఫైనల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఉక్రెయిన్ షూటర్‌తో ఒలెనాతో కలిసి అభిషేక్ వర్మ, స్విస్ షూటర్ గెర్బర్తో కలిసి సౌరభ్ చౌదరిలు పోటీ పడినా వరుసగా 6, 7 స్థానాల్లో నిలిచారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-12 స్థానాల్లో నిలిచిన షూటర్లను డ్రా ద్వారా జట్లుగా విభజించిన ఐఎస్ఎస్ఎఫ్.. షూటింగ్ వరల్డ్ ఫైనల్స్‌ను కొత్త తరహాలో ప్రెసిడెంట్ కప్‌గా నిర్వహిస్తోంది.