Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్ ఢ నేడే
అబుదాబి (యుఏఈ) : అగ్రజట్టు భారత్ ఐసీసీ ఈవెంట్లలో సెమీఫైనల్ చేరుకునేందుకు ఇతర జట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి అనివార్యమైంది. గత కొన్నేండ్లుగా ప్రపంచ దేశాలపై ఎదురులేని ఆధిపత్యం చెలాయిస్తున్న టీమ్ ఇండియా ఆతిథ్య జట్టుగా 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అంచనాలను అందుకోలేదు. సూపర్12 దశలో గ్రూప్-2లో మూడు అగ్రజట్లు, మూడు చిన్న జట్లతో కూడిన సమీకరణం సైతం భారత్‌కు ప్రతికూలమైంది. కారణాలు ఏమైనా.. ఇప్పుడు టీమ్ ఇండియా సెమీఫైనల్ ఆశలు అఫ్గనిస్థాన్‌పై ఆధారపడి ఉన్నాయి. గ్రూప్-2లో భాగంగా నేడు న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్ ముఖాముఖి పోరుకు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో అఫ్గనిస్థాన్ ప్రదర్శనపైనే కోహ్లిసేన సెమీస్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. నాలుగు మ్యాచుల్లో నాలుగు విజయాలతో పాకిస్థాన్ గ్రూప్-2 నుంచి తొలి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. రెండో సెమీస్ రేసులో మూడు జట్లు నిలిచాయి. నాలుగు మ్యాచుల్లో 3 విజయాలతో న్యూజిలాండ్ ముందంజలో ఉండగా.. నాలుగు మ్యాచుల్లో రెండేసి విజయాలతో భారత్, అఫ్గనిస్థాన్ పోటీ పడుతున్నాయి. నేటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై అఫ్గనిస్థాన్ విజయం సాధిస్తే అప్పుడు కివీస్ ఖాతాలో 6 పాయింట్లే ఉంటాయి. సోమవారం నమీబియాతో మ్యాచ్‌లో భారత్ భారీ విజయంతో మెరిస్తే సెమీస్ బెర్త్ కోహ్లిసేన వశం కానుంది. మూడు విజయాలతో అఫ్గాన్ సైతం ఆరు పాయింట్లతో కివీస్, భారత్‌లతో సమవుజ్జీగా నిలువనున్నా.. మెరుగైన్ నెట్ రన్‌రేట్‌తో భారత్ ముందంజ వేయనుంది. ఒకవేళ అఫ్గనిస్థాన్‌పై న్యూజిలాండ్ విజయం సాధిస్తే ఇక ఎటవంటి సమీకరణాలతో నిమిత్తం లేకుండా కేన్ విలియమ్సన్ గ్యాంగ్ సెమీఫైనల్లో అడుగుపెట్టనుంది. అప్పుడు సోమవారం భారత్, నమీబియా మ్యాచ్ నామమాత్రం కానుంది.
భారత్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ పైచేయి సాధించినా నిజానికి ఆ జట్టు అంత గొప్ప ఫామ్‌లో లేదు. స్కాట్లాండ్ సైతం న్యూజిలాండ్‌కు గట్టి సవాల్ విసిరింది. అఫ్గాన్ జట్టులో రషీద్ ఖాన్, మహ్మద్ నబి, ముజీబ్ రెహమాన్ రూపంలో ముగ్గురు ప్రపంచ శ్రేణి ప్రమాదకర స్పిన్నర్లు ఉన్నారు. స్పిన్నర్లు అంచనాల మేరకు రాణిస్తే.. కివీస్‌పై విజయం అఫ్గాన్‌కు ఓ లెక్క కాదు!. రెహ్మానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ షెహజాద్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. చివరి రెండు మ్యాచుల్లో న్యూజిలాండ్ బ్యాటర్లు అంత మెరుగైన ప్రదర్శన చేయలేదు. నమీబియాపై డెత్ ఓవర్లలో, స్కాట్లాండ్పై గప్టిల్ మెరుపులతో కివీస్ గట్టెక్కింది. గ్రూప్ దశలో తమ చివరి మ్యాచ్‌లో విజయం సాధించాలనే ఉత్సాహం అఫ్గనిస్థాన్ శిబిరంలోనూ కనిపిస్తోంది. మధ్యాహ్నాం మ్యాచ్ కావటంతో మంచు ప్రభావం ఉండబోదు.
టీ20 ప్రపంచకప్‌లో నేడు
అఫ్గనిస్థాన్ X న్యూజిలాండ్
వేదిక : అబుదాబి , సమయం : మ: 3.30
పాకిస్థాన్ X స్కాట్లాండ్
వేదిక : షార్జా , సమయం : రా: 7.30
స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం..