Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్‌లో ఇంగ్లాండ్, ఆసీస్ అడుగు
షార్జా : ఐసీసీ టీ20 ప్రపంచకప్ నుంచి దక్షిణాఫ్రికా నిష్క్రమించింది. సూపర్12 దశ గ్రూప్-1 చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించినా దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌కు చేరుకోలేకపోయింది. ఇంగ్లాండ్ (2.464),ఆస్ట్రేలియా (1.216)లతో సమానంగా దక్షిణాఫ్రికా (0.739) నాలుగు విజయాలు సాధించినా మెరుగైన నెట్ రన్‌రేట్‌తో ఆసీస్ ముందంజ వేసింది. 190 పరుగుల రికార్డు ఛేదనలో ఇంగ్లాండ్ చతికిల పడింది. లివింగ్‌స్టోన్‌కు హ్యాట్రిక్ సిక్సర్లు కోల్పోయిన కగిసో రబాడ.. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లతో లెక్క సరి చేశాడు. మోయిన్ అలీ (37), డెవిడ్ మలాన్ (33), లివింగ్‌స్టోన్ (28), జోశ్ బట్లర్ (26), జేసన్ రారు (20), ఇయాన్ మోర్గాన్ (17) మెరిసినా ఇంగ్లాండ్ 179/8 పరుగులకే పరిమితమైంది. 10 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయంతో వరల్డ్‌కప్‌ను ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 189/2 పరుగుల భారీ స్కోరు సాధించింది. వాన్‌డర్ డసెన్ (94 నాటౌట్, 60 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఎడెన్ మార్కరం (52 నాటౌట్, 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో మెరిశాడు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు అజేయంగా 103 పరుగులు జోడించారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ (34, 27 బంతుల్లో 4 ఫోర్లు) రాణించాడు.