Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్కాట్లాండ్పై పాక్ గెలుపు
అబుదాబి: పాకిస్థాన్ మరోసారి సత్తాచాటింది. వరుసగా 5 మ్యాచుల్లో విజయం సాధించింది. స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో పాక్ 72 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది. బాబర్ అజామ్ (66), షోయబ్ మాలిక్ (54 నాటౌట్) అర్ధశతకాలతో రాణించారు. అనంతరం 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 117 పరుగుల చేసింది. దీంతో ఆ జట్టు 72 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. స్కాట్లాండ్ జట్టులో బెరింగ్టన్ (54) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.