Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తరప్రదేశ్‌పై ఘన విజయం
- క్వార్టర్ఫైనల్లో హైదరాబాద్
సుల్తాన్పూర్ : సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. లెఫ్టార్మ్ పేసర్ సి.వి మిలింద్ (5/8) నిప్పులు చెరిగే ప్రదర్శనతో ఉత్తరప్రదేశ్‌పై హైదరాబాద్ 29 పరుగుల తేడాతో గెలుపొందింది. 148 పరుగుల ఛేదనలో సివి మిలింద్ విజృంభణతో ఉత్తరప్రదేశ్ 118 పరుగులకే కుప్పకూలింది. 3.2 ఓవర్లలో 8 పరుగులే ఇచ్చిన మిలింద్ ఐదు కీలక వికెట్లు పడగొట్టి హైదరాబాద్‌కు ఎలైట్ గ్రూప్-ఈలో వరుసగా ఐదో విజయం కట్టబెట్టాడు. కెప్టెన్ తన్మరు అగర్వాల్ (62, 46 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ (38) రాణించటంతో తొలుత హైదరాబాద్ 147/7 పరుగులు చేసింది. గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన హైదరాబాద్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. నవంబర్ 18న ఢిల్లీ పాలెం గ్రౌండ్లో జరిగే క్వార్టర్స్ సమరంలో గుజరాత్‌తో హైదరాబాద్ తలపడనుంది. ఐదు మ్యాచుల్లో 16 వికెట్లు కూల్చిన సివి మిలింద్.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు.