Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోనెపట్: తాను బాగానే ఉన్నానని రెజ్లర్ నిషా దహియా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె తరపున రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వీడియో విడుదల చేసింది. తనను, తన సోదరుడిని దుండగులు కాల్చి చంపినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని నేహా చెప్పింది. గోండాలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు తాను వచ్చానని, సురక్షితంగానే ఉన్నట్లు పేర్కొంది. అంతకుముందు సుశీల్ కుమార్ రెజ్లింగ్ అకాడమీలో రెజ్లర్ నిషా దహియాను, ఆమె సోదరుడిని దుండగులు కాల్చి చంపినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో నిషా తల్లి ధన్పాటి కూడా తీవ్రంగా గాయపడినట్లు పుకార్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. సెర్బియా బెల్గ్రేడ్లో జరిగిన అండర్ 23 ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో 65 కేజీల విభాగంలో నిషా కాంస్యపతకం సాధించారు.