Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్‌లో 5 వికెట్ల తేడాతో అనూహ్య ఓటమి
- టి20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్
అబుదాబి: టి20 ప్రపంచకప్ ఫైనల్లోకి న్యూజిలాండ్ జట్టు ప్రవేశించింది. లక్ష్య ఛేదనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు ఆఖరి 24 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉండగా.. కేవలం 18 బంతుల్లోనే విజయాన్ని కావాల్సిన పరుగులు రాబట్టి కివీస్ జట్టు సంచలన విజయం సాధించింది. కివీస్ ఆల్‌రౌండర్ నీషమ్(27; 11 బంతుల్లో ఫోర్, 3సిక్సర్లు), మిఛెల్(72నాటౌట్; 47బంతుల్లో 4ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను ముగించారు. తొలుత ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగా.. ఛేదనలో న్యూజిలాండ్ జట్టు 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మిఛెల్‌కు లభించింది. ఇక ఇంగ్లండ్ ఓపెనర్లు బట్లర్ రాణించినా.. బెయిర్‌స్టో(13) నిరాశపరిచాడు. ఆ తర్వాత బట్లర్(29) కూడా ఔట్ కావడంతో ఇంగ్లండ్ జట్టు 53 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డేవిడ్ మలన్(41) రాణించాడు. బట్లర్ అవుటైన తర్వాత వచ్చిన మొయిన్ అలీ(51 నాటౌట్) అర్ధసెంచరీతో చెలరేగాడు. తొలుత నిదానంగా ఆడిన మొయిన్.. చివర్లో వేగం పెంచాడు. లియామ్ లివింగ్స్టన్(17) ఒక ఫోర్, ఒక సిక్సర్ కొట్టాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి మోర్గాన్(4 నాటౌట్) ఇచ్చిన క్యాచ్‌ను డీప్ కవర్లో ఫిలిప్స్ జారవిడిచాడు. కీలకమైన బ్యాట్స్‌మెన్ అందరూ రాణించడంతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 4వికెట్లు నష్టపోయి 166 పరుగులు చేసింది. మిల్నే, సౌథీ, సోథీ, నీషమ్‌కు తలా ఒక వికెట్ దక్కాయి.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బట్లర్ (ఎల్బి)సోథీ 29, బెయిర్‌స్టో (సి)విలియమ్సన్ (బి)మిల్నే 13, మలన్ (సి)కాన్వే (బి)సౌథీ 41, మొయిన్ అలీ (నాటౌట్) 51, లివింగ్‌స్టోన్ (సి)సాంట్నర్ (బి)నీషమ్ 17, మోర్గాన్ (నాటౌట్) 4. అదనం 11. (20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 166 పరుగులు.
వికెట్ల పతనం: 1/37, 2/53, 3/116, 4/156
బౌలింగ్: సౌథీ 4-0-24-1, బౌల్ట్ 4-0-40-0, మిల్నే 4-0-31-1, సోథీ 4-0-32-1, సాంట్నర్ 1-0-8-0, నీషమ్ 2-0-18-1, ఫిలిప్స్ 1-0-11-0
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గుప్తిల్ (సి)మొయిన్ (బి)వోక్స్ 4, మిఛెల్ (నాటౌట్) 72, విలియమ్సన్ (సి)రషీద్ (బి)వోక్స్ 5, కాన్వే (స్టంప్)బట్లర్ (బి)లివింగ్‌స్టోన్ 46, ఫిలిప్స్ (సి)బిల్లింగ్స్ (బి)లివింగ్‌స్టోన్ 2, నీషమ్ (సి)మోర్గాన్ (బి) రషీద్ 27, సాంట్నర్ (నాటౌట్) 1, అదనం 10. (19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 167 పరుగులు.
వికెట్ల పతనం: 1/4, 2/13, 3/95, 4/107, 5/147
బౌలింగ్:వోక్స్ 4-1-36-2, జోర్డాన్ 3-0-31-0, ఆదిల్ రషీద్ 4-0-39-1, మార్క్ వుడ్ 4-0-34-0, లివింగ్‌స్టోన్ 4-0-22-2.