Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివక్షపై ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్
మెల్బోర్న్ : యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్‌ను కుదిపేస్తున్న జాతి వివక్ష దుమారంపై ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ స్పందించాడు. చిన్ననాటి నుంచి యార్క్‌షైర్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జో రూట్ తాజా వివాదం నేపథ్యంలో క్లబ్‌ను వీడబోనని యాజమాన్యానికి హామీ ఇచ్చాడు. యార్క్‌షైర్ క్లబ్లో వ్యవస్థీకృత జాతి వివక్ష పాతుకుపోయిందని ఆ క్లబ్ మాజీ ఆటగాడు అజీమ్ రఫీక్ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. రఫీక్ ఆరోపణల ఆధారంగా క్లబ్ సిబ్బందిలో ఎవరినీ తొలగించబోమని క్లబ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో క్లబ్ ప్రధాన స్పాన్సర్లు తమ ఒప్పందాలను రద్దు చేసుకుంది. యాషెస్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న జో రూట్ ఈ పరిస్థితులపై స్పందించాడు. ' జాతి వివక్షపై చర్చకు తావు లేదు. అది ఏమాత్రం క్షమార్హం కాదు. జాతి వివక్ష సంఘటనలు ఆటకు గాయం చేశాయి, క్రికెటర్ల జీవితాలను రెండుగా చీల్చాయి. అభిమానులు, ఆటగాళ్లు, మీడియా అందరం కలిసి బలంగా పుంజుకోవాల్సి ఉంది. ఆటను అందరూ అభిమానించేలా చేసేందుకు మనకు ఓ అవకాశం ఉంది' అని జో రూట్ అన్నాడు.