Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ హాకీ వరల్డ్‌కప్‌కు భారత్
భువనేశ్వర్ : టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, యువ ఆటగాడు వివేక్ సాగర్ ప్రసాద్‌కు సముచిత గౌరవం లభించింది. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు భువనేశ్వర్ వేదికగా ఆరంభం కానున్న ఎఫ్ఐహెచ్ జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టుకు వివేవ్ సాగర్ ప్రసాద్ కెప్టెన్సీ వహించనున్నాడు. ఈ మేరకు హాకీ ఇండియా గురువారం వెల్లడించింది. బయో బబుల్, కోవిడ్-19 పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దినచంద్ర సింగ్, బాబీ సింగ్ దామిలను ప్రత్యామ్నాయ ఆటగాళ్లుగా ఎంపిక చేసింది. 18 మంది జట్టులో ఎవరైనా గాయపడితే ఈ ఇద్దరు తుది జట్టులోకి రానున్నారు. ' డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు సమతూకంగా ఉంది. యువ జట్టు మెగా వేదికపై రాణించాలంటే తమపై విశ్వాసం, సన్నద్ధతపై నమ్మకం ఎంతో అవసరం' అని చీఫ్ కోచ్ గ్రాహం రీడ్ తెలిపాడు. నవంబర్ 24న ఫ్రాన్స్‌తో మ్యాచ్‌తో టీమ్ ఇండియా టైటిల్ వేటను ఆరంభించనుంది.
భారత జట్టు : వివేక్ సాగర్ ప్రసాద్ (కెప్టెన్), సంజరు (వైస్ కెప్టెన్), శారదానంద తివారి, ప్రశాంత్ చౌహాన్ (గోల్‌కీపర్), సుదీప్ చిర్మాకో, రాహుల్ కుమార్ రాజ్‌బార్, మణిందర్ సింగ్, పవన్ (గోల్ కీపర్), విష్ణుకాంత్ సింగ్, అంకిత్ పాల్, ఉత్తమ్ సింగ్, సునీల్ జోజో, మంజీత్, రవిచంద్ర సింగ్, అభిషేక్ లక్రా, యశ్దీప్ సివాచ్, గుర్ముక్ సింగ్, అరరుజిత్ సింగ్ హుందాల్.