Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటీఆర్
హైదరాబాద్ : బ్యాడ్మింటన్ గురువు, ఒలింపిక్ పతక విజేతల రూపకర్త పుల్లెల గోపీచంద్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని ఐఎస్బిలో జరిగిన ఓ కార్యక్రమంలో గోపీచంద్ జీవిత కథ పుస్తకాన్ని మంత్రి కెటీఆర్, రచయిత ప్రియ కుమార్తో కలిసి ఆవిష్కరించారు. ' జీవితంలో ఎదిగేందుకు ప్రతి మనిషికి అవకాశం లభిస్తుంది. సద్వినియోగం చేసుకున్నప్పుడే గుర్తింపు లభిస్తుంది. ఆర్థోస్కోపిక్ శస్త్రచికిత్స సమయంలో గోపీచంద్ కోలుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. అతని పట్టుదల, కృషితోనే తిరిగి బ్యాడ్మింటన్ కోర్టులోకి రాగలిగాడు. 1998లో కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం, 2001లో ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్షిప్ నెగ్గిన రెండో భారతీయుడిగా గోపీచంద్ నిలిచారు. 2008లో బ్యాడ్మింటన్ అకాడమీ స్థాపనతో భారత్ గర్వపడే షట్లర్లను తయారు చేశాడని' కేటీఆర్ కొనియాడారు.