Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2021 జాతీయ క్రీడా పురస్కారాలను శనివారం రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ప్రదానం చేశారు. దర్బార్ హాల్లో పరిమిత సంఖ్యలో హాజరైన అతిథుల నడుమ టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డును అందుకున్నాడు. హైదరాబాదీ అమ్మాయి, భారత మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ ఖేల్‌రత్న అందుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. సునీల్ ఛెత్రి ఖేల్‌రత్న అందుకోవటంతో ప్రతిష్టాత్మక పురస్కారం తొలిసారి ఫుట్‌బాల్ ఆటగాడికి దక్కింది. టోక్యో ఒలింపిక్ స్టార్స్ రవి కుమార్ దహియా (రెజ్లింగ్), లవ్లీనా బొర్గొహైన్ (బాక్సింగ్), పీఆర్ శ్రీజేశ్ (హాకీ), మన్‌ప్రీత్ సింగ్ (హాకీ)లతో పాటు పారా స్టార్స్ అవని లేఖర (షూటింగ్), సుమిత్ అంతిల్ (అథ్లెటిక్స్), ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్), మనీశ్ నర్వాల్ (షూటింగ్), కృష్ణ నాగర్ (బ్యాడ్మింటన్)లు అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్న అందుకున్నారు. క్రికెటర్ శిఖర్ ధావన్ సహా 35 మంది క్రీడాకారులు అర్జున పురస్కారం అందుకున్నారు.