Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెస్టు స్పెషలిస్ట్‌ల కోసం ఏర్పాటు
ముంబయి : భారత్, న్యూజిలాండ్ టీ20 సిరీస్ నవంబర్ 17 నుంచి ఆరంభం కానుంది. పొట్టి సిరీస్‌లో భాగంగా లేని ఐదు రోజుల ఆట నిపుణుల కోసం బీసీసీఐ ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తోంది. ముంబయి క్రికెట్ సంఘం (ఎంసీఏ) మైదానం బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బికెసి)లో సోమవారం నుంచి నాలుగు రోజుల క్యాంప్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి టెస్టు కాన్పూర్‌లో నవంబర్ 25న ఆరంభం కానుంది. కోహ్లి గైర్హాజరీలో కాన్పూర్ టెస్టులో కెప్టెన్సీ వహించనున్న అజింక్య రహానె ఇప్పటికే బికెసిలో ప్రాక్టీస్ ఆరంభించాడు. నాలుగు రోజుల క్యాంప్‌కు రహానెతో పాటు బ్యాటర్లు చతేశ్వర్ పుజార, మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్లు వృద్దిమాన్ సాహా, కెఎస్ భరత్, బౌలర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, ప్రసిద్ కృష్ణ, జయంత్ యాదవ్‌లు పాల్గొంటారు.