Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : 57వ నెహ్రూ సీనియర్ హాకీ టోర్నీ ఆదివారం ఆరంభమైంది. సంప్రదాయ వేదిక న్యూఢిల్లీని కాదని తొలిసారి ఈ టోర్నీకి హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని హాకీ గ్రౌండ్లో రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ టోర్నీని లాంఛనంగా ఆరంభించారు. ఆరంభ వేడుకల్లో దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రదర్శించిన కళారూపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఆయిల్, ఆర్మీ ఎలెవన్, పంజాబ్ సింధ్ బ్యాంక్, ఇండియన్ రైల్వేస్, కాగ్ ఎలెవన్ సహా అన్‌సీడెడ్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్ఎఫ్సీ), తమిళనాడు ఎలెవన్, ముంబయి ఎలెవన్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఎయిర్‌ఫోర్స్, తెలంగాణ ఎలెవన్, ఇండియన్ నేవి, ఢిల్లీ ఎలెవన్ జట్లు టోర్నీలో పోటీపడనున్నాయి.