Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాష్ట్ర ఫెన్సింగ్ చాంపియనషిప్లో అండర్-17 బాలుర విభాగం ఫాయిల్ కేటగిరీలో హైదరాబాద్కు చెందిన తనీష్క్ జాదవ్, అండర్-14 ఇపి బార్సు విభాగంలో నాగసాయి కష్ణ స్వర్ణ పతకాలు సాధించారు. కరీంనగర్లో మూడ్రోజులుగా జరుగుతున్న ఈ పోటీలు సోమవారం ముగిశాయి. అండర్-14-17, 20 విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఫాయిల్ అండర్-17 కేటగిరీలో తనీష్క్ ప్రథమ స్థానం దక్కించుకోగా ఇలియాసుద్దీన (నల్లగొండ) ద్వితీయ, సతీష్ (కరీంనగర్) తతీయ స్థానం దక్కించుకున్నారు. ఇపి కేటగిరీలో నాగసాయి పసిడి సాధించగా కె.సంజరు (రంగారెడ్డి) రజతం, ఎన.ఆశీష్ (కరీంనగర్) కాంస్య పతకం సాధించారు. అండర్-20 ఇపి బాలుర కేటగిరీలో లోకేష్ (మేడ్చల్), మురళీ (మేడ్చల్), వంశీ (హైదరాబాద్) తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. రాష్ట్ర ఫెన్సింగ్ సంఘం కోశాధికారి సందీప్ కుమార్, ఎఫ్ఏఐ పరిశీలకులు రాజ్వీర్ విజేతలకు పతకాలు ప్రదానం చేశారు