Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాయాలతో సైనా, సమీర్ దూరం
- నేటినుంచి ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీ
బాలి: ఒలింపిక్స్‌లో రెండుసార్లు పతకాలు నెగ్గిన పివి సింధు మంగళవారంనుంచి ప్రారంభం కానున్న ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ష్750 టోర్నీ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన సింధు.. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గింది. ఆ తర్వాత జరిగిన డెన్మార్క్ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు, ఫ్రాన్స్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించగల్గింది. ఆ తర్వాత జర్మనీ వేదికగా జరిగిన హైలో ఓపెన్ ప్రాతినిధ్యం వహించలేదు. పివి సింధు చివరిసారిగా 2019లో స్విట్జర్లాండ్ వేదికగా ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ ఏడాది జరిగిన స్విస్ ఓపెన్ టోర్నమెంట్ ఫైనల్లోకి దూసుకొచ్చినా తుదిపోరులో పరాజయాన్ని చవిచూసింది. ఈ టోర్నమెంట్లో సింధు 3వ సీడ్‌గా బరిలోకి దిగుతోంది. సింధు తొలి రెండు రౌండ్లలో స్పెయిన్‌కు చెందిన క్లారాతో ఆ తర్వాత కెనడాకు చెందిన 6వ సీడ్ మిఛెల్లెతో తలపడనుంది. సెమీస్‌లో టాప్‌సీడ్ జపాన్‌కు చెందిన యమగుచితో తలపడాల్సి ఉంటుంది. హైలో ఓపెన్‌లో సెమీస్‌కు చేరిన ఆశలు రేపిన కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ కూడా ఈ టోర్నీ బరిలోకి దిగుతున్నారు. గాయాల కారణంగా సైనా నెహ్వాల్, సమీర్ వర్మ టోర్నమెంట్‌కు దూరంగా ఉన్నారు.