Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జాతీయ పవర్‌లిఫ్టింగ్ పోటీలు బుధవారం ఆరంభమయ్యాయి. 26 రాష్ట్రాల నుంచి సుమారు 560 మంది అథ్లెట్లు పోటీపడుతున్న టోర్నీకి ఎల్బీ స్టేడియం వేదికగా నిలిచింది. 1998లో తొలిసారి హైదరాబాద్‌లో జాతీయ టోర్నీ నిర్వహించగా.. సుదీర్ఘ విరామం అనంతరం మరోసారి పవర్‌లిఫ్టింగ్ జాతీయ పోటీలకు నగరం ఆతిథ్యం ఇస్తోంది. ఆరంభ వేడుకలకు ఎల్బీనగర్ ఎమ్మెల్కే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక కార్పోరేషన్ చైర్మన్ ఉప్పాల శ్రీనివాస్ గుప్త, భారత పవర్‌లిప్టింగ్ ఫెడరేషన్ సత్య ప్రకాశ్, తెలంగాణ పవర్‌లిప్టింగ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తొలి రోజు పోటీలలో 53 కేజీల విభాగంలో 32 మంది లిఫ్టర్లు, 59 కేజీల విభాగంలో 36 మంది లిఫ్టర్లు పోటీపడ్డారు.