Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రికెట్ కమిటీ ఛైర్మెన్‌గా నియమించినట్టు ఐసీసీ బుధవారం ప్రకటించింది. అంతకు ముందు ఈ పదవిలో ఇండియా మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే ఉన్నాడు. ''అనిల్ కుంబ్లే తొమ్మిద సంవత్సరాల పాటు కొనసాగాడు. అతడి స్థానంలో బీసీసీఐ ఛైర్మన్ సౌరవ్ గంగూలీని నియమించారు. ఈ పదవి పదవీ కాలం మూడు సంవత్సరాలు కాగా కుంబ్లే మూడు పర్యాయాలు పని చేశారు. గంగూలీ భారత జట్టు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా, అతని తరంలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఒకరిగా గుర్తింపు పొందించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ విడ్కోలు పలికిన తర్వాత గంగూలీ 2015, 2019 మధ్య బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేశాడు. 2019 అక్టోబర్‌లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు. ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మెన్‌గా గంగూలీని నియమించడం ఆనందంగా ఉందని ఐసీసీ ఛైర్మెన్ గ్రెగ్ బార్క్లే అన్నాడు.