Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్థ సెంచరీతో మెరిసిన సూర్యకుమార్ యాదవ్
- రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్
- చెరో రెండు వికెట్లతో రాణించిన భువనేశ్వర్, అశ్విన్
న్యూఢిల్లీ: జైపూర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. బౌలింగ్ ఎంచుకున్నాడు. న్యూజిలాండ్ భారీ స్కోరు చేయకుండా భారత బౌలర్లు కివీస్‌ను కట్టడి చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 165 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యన్ని చేధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (48 పరుగులు), కేఎల్.రాహుల్ శుభారంభం అందించారు. కేఎల్.రాహుల్ 15 పరుగులు చేసి ఔట్కాగా, తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ బౌండరీలు బాదుతూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. క్రీజ్‌లో సూర్యకుమార్ యాదవ్ (62 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన కీవిస్... తొలి ఓవర్ మూడో బంతికే ఓపెనర్ డారిల్ మిచెల్ (0)ను భువనేశ్వర్ క్లీన్ బౌల్డ్ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. అయితే తర్వాత క్రీజులోకి వచ్చిన మార్క్ చాప్మన్ (63)తో కలిసి మరో ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (70) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ కలిసి సెంచరీ (109) భాగస్వామ్యం నిర్మించారు. అయితే, వెంటవెంటనే చాప్‌మన్‌తోపాటు ఫిలిప్స్ (0) పెవిలియన్‌కు చేరాడు. ఈ రెండు వికెట్లను అశ్విన్ పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సీఫర్ట్ (12)తో కలిసి గప్తిల్ ధాటిగా ఆడాడు. మళ్లీ గప్తిల్, సీఫర్ట్ స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో కివీస్ స్కోరు బోర్డు వేగం తగ్గిపోయింది. భారత బౌలర్లలో అశ్విన్ 2, భువనేశ్వర్ 2.. చాహర్, సిరాజ్ చెరో వికెట్ తీశారు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్తిల్ (సి) శ్రేయాస్ అయ్యార్ (బి) చాహార్ 70, మిచెల్ (బి) భువనేశ్వర్ 1, చాప్మన్ (బి) అశ్విన్ 63, ఫిలిప్స్ (బి) అశ్విన్ 0, సీపర్ట్ (సి) సూర్యకుమార్ యాదవ్ (బి) భువనేశ్వర్ 12, రచిన్ రవీంద్ర బ్రి) సిరాజ్ 1, సాట్నర్ 4 నాటౌట్, సౌథీ 0 నాటౌట్. ఎక్సట్రాలు: 8, మొత్తం (20 ఓవర్లలో 6 వికట్లకు) : 164 పరుగులు
వికెట్లు: 1-1 (డారిల్ మిచెల్, 0.3) 2-110 (మార్క్ చాప్మాన్, 13.2) 3-110 (గ్లెన్ ఫిలిప్స్, 13.5) 4-150 (మార్టిన్ గుప్టిల్, 17.2) 5-153 (టిమ్ సీఫర్ట్, 18.2) 6-162 (రచిన్ రవీంద్ర, 19.5)
భారత్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) చాప్మన్ (బి) సాట్నర్ 15, రోహిత్ శర్మ (సి) రచిన్ రవీంద్ర (బి) బౌల్ట్ 48, సూర్యకుమార్ యాదవ్ (బి) బౌల్ట్ 62, రిషబ్ పంత్ 17 నాటౌట్, శ్రేయాస్ అయ్యర్ (సి) బౌల్ట్ (బి) సౌథీ 5, వెంకటేష్ అయ్యర్ (సి) రచిన్ రవీంద్ర (బి) మిచెల్ 4, అక్షర్ పటేల్ 1 నాటౌట్. ఎక్సట్రాలు: 14 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) : 166 పరుగులు
వికెట్లు: 1-50 ( రాహుల్, 5.1) 2-109 (రోహిత్ శర్మ, 13.2) 3-144 (సూర్యకుమార్ యాదవ్, 16.4) 4-155 (శేయాస్ అయ్యర్, 18.6) 5-160 (వెంకటేష్ అయ్యర్, 19.2).