Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : 57వ నెహ్రూ సీనియర్ హాకీ టోర్నీలో సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్) తొలి ఓటమి చవిచూసింది. గురువారం గ్రూప్-ఏలో డిఫెండింగ్ చాంపియన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)తో మ్యాచ్‌లో 2-4తో పరాజయం పాలైంది. పెనాల్టీ కార్నర్లను సద్వినియోగం చేసుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరో విజయం ఖాతాలో వేసుకుంది. పీఎన్బీ నుంచి భగత్ సింగ్ థిల్లాన్ రెండు గోల్స్‌తో ఆకట్టుకున్నాడు. గ్రూప్-బిలో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (పీఎస్బీ), ఇండియన్ నేవీ మ్యాచ్‌లో ఇండియన్ నేవీ విజయం సాధించింది. అన్‌సీడెడ్ ఇండియన్ నేవీ 1-0తో మెరుపు విజయం నమోదు చేసింది. 56వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్ కొట్టిన జుగ్రాజ్ సింగ్ పీఎస్బీకి షాకిచ్చాడు.