Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెరిసిన తిలక్ వర్మ, మిలింద్
- క్వార్టర్స్‌లో గుజరాత్‌పై గెలుపు
న్యూఢిల్లీ : హైదరాబాద్ అదిరే ప్రదర్శన. రెండు సార్లు చాంపియన్ గుజరాత్‌ను మట్టికరిపించి సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 30 పరుగుల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించిన హైదరాబాద్.. సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ తమిళనాడుతో తలపడనుంది. 159 పరుగుల ఛేదనలో రవితేజ, సివి మిలింద్ విజృంభించటంతో గుజరాత్ 128/8 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో రిపాల్ పటేల్ (35), పియూశ్ చావ్లా (25), హర్షల్ పటేల్ (25) పోరాడినా ఫలితం లేకపోయింది. ధ్రువ్ రావెల్ (7), ఉర్విల్ పటేల్ (1), సౌరవ్ చౌహాన్ (9), కరణ్ పటేల్ (4)లు విఫలమయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. గుజరాత్ స్పిన్నర్ పియూశ్ చావ్లా మాయ చేసినా తిలక్ వర్మ (75, 50 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగగా, ఓపెనర్ తన్మరు అగర్వాల్ (31, 21 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ బుద్ది (25 నాటౌట్, 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇతర క్వార్టర్‌ఫైనల్ మ్యాచుల్లో బెంగాల్‌పై కర్ణాటక సూపర్ ఓవర్లో ఉత్కంఠ విజయం సాధించింది. కేరళపై తమిళనాడు గెలుపొందింది. రాజస్థాన్‌పై విదర్బ విజయం సాధించింది.
స్కోరు వివరాలు :
హైదరాబాద్ ఇన్నింగ్స్ : 158/5 (తిలక్ వర్మ 75, తన్మరు అగర్వాల్ 31, పియూశ్ చావ్లా 2/9, గజ 2/32)
గుజరాత్ ఇన్నింగ్స్ : 128/8 (రిపాల్ పటేల్ 35, పియూశ్ చావ్లా 25, రవితేజ 3/27, మిలింద్ 2/28)